ఓ తల్లి ఆవేదన ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
 నేనిప్పుడు ముసల్దాన్నే
కాటికి కాళ్ళు చాపిన
వయస్సునున్న
ముసల్దాన్నే2
ఇప్పుడు నన్ను
మీ బిడ్డ లెక్క చూసుకోవాల్సిన
ముసల్దాన్నే2
లేవచేతనకావట్లేదు
చేతులు కాళ్లళ్ళ
బలంతగ్గినముసల్దాన్నే2
ఊరెప్పుడో పొమ్మన్నది
దేవుని దగ్గర నుండి పిలుపురాలే 2
ఇంకెంత కాలం
ఈ భూమ్మీద నూకలు ఉన్నయో
అప్పుటిదాకా ఇట్లా
గతెల్లబోయవలసిందే?!2
నా పనులు నేను చేసుకోలేను
నా కన్నకొడుకువు నువ్వు ఉన్నావుకదా 
అని ధీమాతో
నేనున్నా2
ఎందుకు బిడ్డ నన్ను ఈసడించుకుంటావు
రేపు నువ్వు ముసలోనికావారా
నాయనా2
నన్ను గోసబెట్టింది 
నీ కొడుకులు చూస్తున్నరు 
బిడ్డా2
ఎందుకు బిడ్డ నా మీద
నీకు ఇంతకోపం
ఇయ్యాల మనం 
ఇంట్లా 
రేపు మంట్లే
ఎవ్వరూ ఇక్కడ స్థిరంగా ఉండర్రా2
ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు,
చావుతప్పదు బిడ్డా2
ఎవరికైనా చావు గడియోస్తే
ఎవడూ తప్పియ్యలేడు బిడ్డా 2
నేను మీ అమ్మను రా
నేను తొమ్మిది నెలల నిన్ను నా కడుపునమోసి
నా ప్రాణాన్ని అడ్డేసి నిన్ను కన్నాను బిడ్డా2
ముసల్దాన్ని
నేను మహా అయితే ఏడాదో రెండేళ్ళుఏంబ్రతుకుతనో2
నాకు ఆత్మక్షోభపెట్టకు
బిడ్డా2
నువ్వు చిన్నప్పుడు
 నీ చిట్టి పాదాలతో నా గుండెలమీద తన్నితే
నేను నీ పాదాల్ని ముద్దాడి
నా కన్నయ్య పాదముద్రలు అని నేను ఎంత మురిసిపోతినో గదరా3
బిడ్డ నీ కాళ్ళు మ్రొక్కుత
ఈ తల్లిని ఈ అవసాన దశలో
హింసపెట్టకురా2
నా ప్రాణం సహజంగా పోయేలా అవకాశం నాకు కల్పించరా2

కామెంట్‌లు