నేను నాకళ - నాకొచ్చిన కల:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-\9640748497
కళను నమ్ముకున్నం
కళ కళ కోసమే
 కానీ
కాసుకోసం కాదని
కళ‌  సామాజిక చైతన్యం కోసమని
చౌరస్తాలో  మీటింగ్ పెడితే 
ఆవేశపూరితంగా
నేను ప్రసంగించిన
ఇదెవరో!?
సోషల్ మీడియాలో 
 పెడితే వైరలైనది 
ఎంతో మంది ప్రశంసలు పొగడ్తలు ఫ్లవర్ బొకేలతో శుభాకాంక్షలు
కొత్త కొత్త ఉపమానాలతో  
నన్ను ఆకాశానికి ఎత్తారు
ఇక లెఫ్ట్ పార్టీల పత్రికలు నా పైన ప్రత్యేక వ్యాసమే
వ్రాసాయి
ఈ  ఊహించని పరిణామానికి
ఒకవైపు పట్టరాని సంతోషం
ఓ వైపు నా పేదరికం
 నాపై నేనే
జాలిచూపుతూనే
ఇల్లు చేరాను 
నా ఇల్లాలు నా ఇంటిదేవత
 వచ్చావా!
ఊళ్ళో కార్యాలు
రాచమర్యాదలు
సన్మానాలు అన్నీ పూర్తయ్యాయా?!
ఇంట్లో అన్ని సరుకులు నిండుకున్నాయి
 ఇవ్వు డబ్బులివ్వూ?!
 అని అంది
నేను తెల్ల మోగమేసి చూస్తున్నాను
అంతలోనే నా భార్య అందుకొని ఇంటిని చక్కదిద్దలేనోడు ఊరును బాగుచేస్తడంటా!?
అని ఎద్దేవా చేస్తుంది?!
ఏవండి ?
ఒక్కమాట చెబుతా 
మీరు వింటారా ?! 
మనమధ్య తరగతోళ్ళే
 కష్టాలతో !?ఉత్థాన పతనాలతో సహవాసం చేస్తుంటారు
ఎందుకండీ?
మనకీ సంగోద్ధరణ!?
ముందు మనగురించి ఆలోచించుకోవాలి 
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని మీకు తెలియదా!?
నా ఇల్లాలు హితోపదేశం చేస్తుంది
అంతలోనే మెలుకువ వచ్చింది
ఓహో !?
ఇది కలనా  !?
నిజమా అని
అనుకునేలోపే బారెడు పొద్దెక్కింది లేసేదుందా!?
పెరిగే యాళ్ళా
 పడుకోండి
అని అంటున్న
 నా శ్రీమతి మేల్కొలుపు గీతం ఆలపించడంతో...
పడుకున్న వాడిని దిగ్గునలేచిన
ఇక నా ఆలోచనల పరంపరకు
పులిస్టాప్ పెట్టిన 
ఉదరపోషణార్ధం పనిపాటకై పయనమైనా----?!


కామెంట్‌లు