జయము జయము ఓ మాత
జయము దుర్గమాత
అనుక్షణము కాపాడే ఆది దుర్గ మాత!! జయము!!
నీవే కద ప్రకృతివి
నీవే కద వికృతివి
నీవే కద జగదాంబవి
నీవే కద భ్రమరాంబవి
సకల సృష్టిని ఏలే లోకమాత నీవే కద !! జయము జయము!!
మహిసాసుర మర్థినివి
శుంభనిశుంభ మర్థినివి
దుష్టులను దునుమాడే
దుర్గామాతవు నీవే!!జయము జయము!!
పాడిపంటలతో జగము
కాపాడే ఓ జననీ
లోకమున ధర్మాన్ని
స్థాపన జేయవే మాతా!! జయము జయము!!
అందరిలో అనురాగము
ఆత్మీయత నింపవే
ఒకరిపైన ఒకరికి
ప్రేమను కలిగింపవే
శాంతి కరుణ పుడమిలో
వర్ధిల్ల జేయుమా
జయము శుభములిచ్చి మమ్ము
పాలించు పావనీ!! జయము జయము!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి