మేమే! మేమే! పిల్లలం: - -గద్వాల సోమన్న,9966414580
కొమ్మ కొమ్మకు పూసిన పువ్వులం
స్వేచ్ఛగా విహరించే గువ్వలం
మేము "రేపటి భారత పౌరులం" 
గృహమున ప్రకాశించే దివ్వెలం

మిలమిలమని మెరిసే తారలం
గలగలమని పారే యేరులం
కిలకిలమని నవ్వే పిల్లలం
ఘుమఘుమలాడే సిరిమల్లెలం

 అల్లరి చేసే అగ్గి పిడుగులం
ఎల్లరి మెచ్చే చిన్న పిల్లలం
చిటపట చినుకులు కురిశాయంటే
కాగితాల పడవల ప్రేమికులం

ఇంటిలో ఉంటే కోలాహలం
మింటిలో ఉండే రవిచంద్రులం
అమ్మానాన్నల కలల పంటలం
ఆశలు తీర్చే మగధీరులం


కామెంట్‌లు