తాతయ్య పలుకులు:- -గద్వాల సోమన్న,9966414580
మనసు మనసు తెలుసుకొని
చేయి చేయి కలుపుకొని
ప్రగతి పథమున నడవాలి
దేశభక్తి పెంచుకొని

అనురాగం పెంచుకొని
ఆత్మీయత పంచుకొని
బ్రతకాలోయ్! హాయిగా
దానవత్వం త్రుంచుకొని

కన్నవారిని తలచుకొని
వ్యక్తిత్వం మలచుకొని
గొప్పగా ఉండాలోయ్!
మంచి వారిని కలుసుకొని

పెద్ద చదువులు చదువుకొని
ప్రశంసలే! అందుకొని
పేరెంతో పొందాలోయ్!
దేశఖ్యాతి చాటాలోయ్!


కామెంట్‌లు