పరోపకారులు;- -గద్వాల సోమన్న,9966414580
పూచే పూవులు
వీచే గాలులు
పరోపకారులు
చూడగ పిల్లలు

పారే యేరులు
ప్రాకే తీగలు
పరోపకారులు
పాడే ఖగములు

మెరిసే తారలు
కురిసే చినుకులు
పరోపకారులు
పొడిచే ప్రొద్దులు

వెలిగే ప్రమిదలు
ఎదిగే మొక్కలు
పరోపకారులు
ఎగిరే చిలుకలు

వ్రాసే కలములు
పండే పొలములు
పరోపకారులు
పుడమిని జలములు

బడిలో గురువులు
గుడిలో వేల్పులు
పరోపకారులు
మడిలో మొలకలు


కామెంట్‌లు