అక్షర పద హారాలు:- -గద్వాల సోమన్న,9966414580
కోయిలమ్మ గానము
మధురమైన రాగము
మాకెంతో ఇష్టము
ఉదయ కాల ధ్యానము

పుస్తకాల స్నేహము
చేస్తామిల సతతము
ఆర్జిస్తాం తప్పక
అందులోని జ్ఞానము

మయూరమ్మ నాట్యము
పంతులమ్మ పాఠము
చాలా ఉపయుక్తము 
సృష్టిలోని సర్వము

భగవంతుని రూపము
జీవితాన దీపము
రక్తదానమిచ్చిన
కన్నవారు ప్రాణము

చూసుకునే అద్దము
సరిచేయును లోపము
కాదు! కాదు! గొప్పది
బాహ్య సౌందర్యము

శుద్ధమైన హృదయము
అంతరంగ అందము
జగతిలో అమూల్యము
బ్రతుకులో గౌరవము


కామెంట్‌లు