వాన చినుకులు:- -గద్వాల సోమన్న,9966414580
పడితేనే చినుకులు
పరవశించు మొలకలు
చుట్టూ  పచ్చదనము
కనులకు పర్వదినము

చినుకులు పడకుంటే
ఎడారి భూగోళము
పచ్చని చెట్లు లేక
అగును అగ్నిగుండము

నింగి తల్లి విసరే
పూల వాన చినుకులు
పుడమిపైన చల్లే
కావా!! అక్షింతలు

చిన్నారులకిష్టము
రైతులకూ ఇష్టము
జగతిలోని ప్రాణులకు
మరీ మరీ ఇష్టము

వాన కాలమొస్తే
నాట్యమాడు గొడుగులు
నడుస్తూ..తడుస్తూ 
సంతసించు పిల్లలు

కురియాలోయ్! వానలు
మురియాలోయ్! మనసులు
చిగురించాలి రైతులు
పెట్టుకున్న ఆశలు


కామెంట్‌లు