న్యాయాలు-655
యదనంతర న్యాయము
******
యదనంతరం అనగా యత్ + అనంతరం. వాటంతట అవే జరిగే పనులు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరగడం అని అర్థము.
"యదనంతర న్యాయము" అనేది ఒకానొక చిత్రమైన న్యాయంగా చెప్పుకోవచ్చు. యాదృచ్ఛికంగా ఎవరి ప్రమేయం లేకుండా ఒకదాని తర్వాత మరొకటి జరుగుతుంది.ఆ జరిగింది మాత్రం ఆయా వ్యక్తులకు మంచిగానో చెడుగానో ఆపాదించబడుతుంది.
మంచి జరిగితే ఫర్వాలేదు కానీ చెడు జరిగితేనే బోలెడు యిబ్బందులు, బాధలు, మానసిక వేదనలు, వేధింపులు మొదలైనవి ఎన్నో ఉంటాయి.
ముందుగా మంచికి లేదా శుభానికి సంబంధించిన విషయాలను చెప్పుకుందాం.
ఎవరింట్లోనైనా అబ్బాయో, అమ్మాయో పుట్టిన తర్వాత వారింటి ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే "గొడ్డొచ్చిన వేళ - బిడ్డొచ్చిన వేళా విశేషము" అంటుంటారు.
ఆ మంచి పేరు పుట్టిన శిశువుకు అన్వయించి ఆనందిస్తుంటారు.అంతే కాదు శిశువు పుట్టిన ఇంటి వాళ్ళు మరింత ఆర్థికంగా బలం పుంజుకుంటే " "కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు" అన్నట్లు సామెతను వాడుతూ వాళ్ళకేం వేళా విశేషం "కాళ్ళ చేతుల సంపాదన పోగవుతుంది" అని కూడా అంటుంటారు.
ఇక అశుభ విషయానికి వస్తే ...కోడలు అత్తారింటిలో అడుగు పెట్టిన కొత్తలో అత్తగారికి ఏ అనారోగ్యమో వచ్చి మంచాన పడితేనో, మరణిస్తేనో."కోడలు గృహ ప్రవేశం - అత్త అడవి ప్రవేశం " అనే అపవాదును కోడలు జీవితాంతం మోయాల్సి వుంటుంది.
పైన చెప్పిన "గొడ్డొచ్చిన వేళ-బిడ్డొచ్చిన వేళా"సామెతను వక్రీకరించి అనే వారు కూడా ఉన్నారు.అదెదా అంటే ఆ అమ్మాయి వచ్చిన వేళా విశేషము అస్సలు బాగాలేదు అనే అర్థంతో కోడలిని రాచి రాచి రంపాన పెట్టడం జరుగుతుంది.
ఇలా సంబంధం లేని సంఘటనలను ఒకదాని వెంట ఒకటి జరిగినవి ముడివేసి తద్వారా నెపం ఎవరో ఒకరి మీద నెట్టడంతో ప్రశాంతమైన వాతావరణం కాస్తా అనిశ్ఛితి ఆకాశంలో భారమైన మేఘంలా అవుతుంది.
ఇలా ఒకదాని తరువాత మరొకటి వెంట వెంటనే జరగడంలో మంచి తటస్థిస్తే మురిసిపోతూ, చెడు సంభవిస్తే ఇతరులపై నెట్టి బాధ పడటం " "యదనంతర న్యాయము" లోని విశేషమన్న మాట.
"యదనంతరమా? తదనంతరమా అనేది కాకుండా ఈ న్యాయం ద్వారా మనం అలవరచుకోవాల్సింది ఏమిటంటే స్థితప్రజ్ఞత.యాదృచ్ఛికంగా జరిగే ఘటనలను ఓ నెపంగా ఇతరుల మీద అనవసరంగా నెట్టకుండా ఉండాలి. అలా అపోహలు,మూఢ నమ్మకాలకు తావిచ్చి ఆయా వ్యక్తులను పొగడటమో,తెగడటమో చేయకూడదు.మరి మీరు ఏమంటారు?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి