అమ్మపాట పాడాలని ఉన్నది:-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కన్నతల్లిని
కొనియాడాలని ఉన్నది
అమ్మభక్తిని
చూపించాలని ఉన్నది

విశ్వమంత వినేలా
వినువీధికి ఎగిరి
మాతృమూర్తి ప్రేమను 
మాటల్లో చెప్పాలని ఉన్నది

మేఘాలపై కూర్చొని
అమ్మపాటను పాడాలని ఉన్నది
గాలిలో పక్షిలా ఎగిరి
మాతఘనతను తెలపాలని ఉన్నది

కన్నతల్లి కాళ్ళుకడిగి
తలపై చల్లుకోవాలని ఉన్నది
భుజాలపైన ఎత్తుకొని
భక్తితో మోయాలని ఉన్నది

జగాన్ని మరచి
తల్లికి సేవలుచేయాలని ఉన్నది
జనయిత్రిని పూజించి
జన్మను ధన్యంచేసుకోవాలను ఉన్నది

అమ్మ మనసునెరిగి 
మసుకోవాలని ఉన్నది
అమ్మ కొరికలను
తీర్చాలని ఉన్నది

తల్లే దేవతని
చెప్పాలని ఉన్నది
తల్లే గొప్పయని
చాటాలని ఉన్నది


కామెంట్‌లు