పిలుపు ...!!:--- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్.

 ఇప్పుడు ....
తాత ..అని పలకడమే కాదు ,
'తాతా ..' అని పిలుస్తున్నాడు !
ఏదోఒక చిలిపి పని చేస్తాడు ...
అదిచూడమన్నట్టు ....
తాతా ...అని పలకరిస్తాడు !
మద్యాహ్నం -
భోజనం ముగించుకుని 
కాసేపు ....
నిద్రకుపక్రమిస్తానా ...
మంచినిద్రలోవుండగా ....
నాశరీరం కుదుపుతూ ....
తాతా ...అంటూ ...
నాకునిద్రాభంగం కలిగిస్తాడు !
అలాంటప్పుడు 
నిద్ర చెడగొట్టినందుకు 
నాకు బాధకలుగదు ....
తాతా ...అని పిలిచినందుకు 
మహా సంతోషమనిపిస్తుంది !
తాతలోని ప్రేమగుణం 
నచ్చుతుందేమో ---
మనవడు ' నికో ' కి,
వాడితోనే హాయిగానాకు -
జీవితంగడిచిపోతుందని ,
తెలియదు నామనవడు 
' నివిన్ అయాంశ్' కి....!!
              ***
కామెంట్‌లు