గడియారం :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 గడియారం 
ఇది గడియారం 
చేతులతో కాలాన్ని పిలుస్తుంది
మనకు సమయాన్ని గుర్తు చేస్తుంది
పగలూ రాత్రులను తన బాహువులతో 
కొలిచి మరీ చూపుతుంది
ఎప్పుడు ఏంచేయాలో
గంట కొట్టి మరీ చెబుతుంది 
మనల్ని ముందుకు నడిపిస్తుంది 
జనన మరణాల సమయాన్ని
పెళ్ళి పేరంటాల సమయాన్ని
బడి, గుడి, కార్యాలయాల సమయాన్ని 
ప్రయాణ సాధనాల సమయాన్ని 
జ్ఞాపకం చేసి ముద్దుగా చెబుతుంది 
కాలం విలువ తెలుసుకొమ్మని 
కాలాన్ని సద్వినియోగం చేసుకొమ్మని
హెచ్చరిస్తుంది! 
కాని...
ఏ నిముషాన ఏమవుతుందో 
ఎప్పుడు ఎవరు ఏమవుతారో 
పాపం!
గడియారముకు ఏమి తెలుసు?
మౌన సాక్షిగా
అలా ఉండిపోవడం తప్ప!!
**************************************

కామెంట్‌లు
Ramakrishna Patnaik చెప్పారు…
మౌనసాక్షిగా ఉండిపోయేదే గడియారం అంటూ గొప్పగా చెప్పారు! అభినందనలు!