రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రోజున డా. జలపాల సాహిత్యంలో బతుకమ్మ పాటల సెమినార్ జరిగినది.
స్థానిక సిరిసిల్ల పట్టణంలోని గాంధీ నగర హనుమాన్ దేవాలయంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ బెనెవోలేంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వ పండుగగా జరుపుకునే బతుకమ్మ పాటలను శంకరయ్య తన తల్లి లస్మవ్వ పాడిన పాటలను పుస్తక రూపంలో తీసుకురావడం సంతోషకరమైన విషయం అన్నారు. ఆటపాటలతో బతుకమ్మ పండుగ అన్ని వర్గాల ప్రజలు జరుపుకోనే భాగంగా తెలంగాణ ఆడపడుచులు ఆరాధ్య దైవంగా బతుకమ్మను కొలుస్తారని గుర్తు చేశారు.
వాసరవేణి మాట్లాడుతూ డాక్టర్ జనపాల జీవితం చిన్ననాటి నుండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విద్యారంగంలో నిలిచి గెలిచిన పట్టుదల కలిగిన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే వాక్యానికి బదులుగా ఎదిగిన వారు అన్నారు. శంకరయ్య గారి తల్లి జనపాల లస్మవ్వ జ్ఞాపక శక్తి అమోఘం 150 పేజీలలో మూడు కథలు అంటే అంత అంశాన్ని జ్ఞాపకంతో పాడడం సామాన్య విషయం కాదన్నారు.
కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జనపాల శంకరయ్య గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళీధర్, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్,చిటికెన కిరణ్ కుమార్, పుస్తక సమీక్షకులు వాసరవేణి పరుశరాములు, ప్రముఖులు ఏనుగుల ఎల్లయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కోడం నారాయణ, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు..
( కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రసంగిస్తున్న ఇంటర్నేషనల్ బెనెఓలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ )
సద్దుల బతుకమ్మ పాటల పుస్తకం పై సాహిత్య చర్చ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి