ఏమిటీజగం? ఎందుకీజన్మం?;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆకాశం
క్రింద పడదేమిటి
భూగోళం
పైకి ఎగరదేమిటి

సూర్యగమనం
ఆగిపోదేమిటి
కాలచక్రం
నిలిచిపోదేమిటి

సముద్రం
ఇంకి పోదేమిటి
సంసారం
విడిచిపెట్టదేమిటి

అందాలు
ఆకట్టుకుంటున్నాయిదేనికి
ఆనందాలు
అస్వాదించమంటున్నాయిదేనికి

చెట్లు
ఎదుగుతున్నాయిదేనికి
పూలు
పూస్తున్నాయిదేనికి

పరిమళాలు
ఆఘ్రానించమంటున్నాయిదేనికి
సుస్వరాలు
ఆలకించమంటున్నాయిదేనికి

అరణ్యాలు
ఆకర్షిస్తున్నాయిదేనికి
సెలయేర్లు
ప్రవహిస్తున్నాయిదేనికి

ప్రేమలు
పుడుతున్నాయిదేనికి
బంధాలు
కట్టేస్తున్నాయిదేనికి

జీవితపయనం
సాగించమంటుందిదేనికి
గమ్యాలను
చేరుకోమంటుందిదేనికి

తలపులు
తట్టిలేపటందేనికి
తనువులు
తహతహలాడటందేనికి

కలాలు
పట్టమంటున్నాయిదేనికి
కవితలు
కూర్చమంటున్నాయిదేనికి

జీవితం గమ్యసాధనకే
జవసత్వం పూలబాటనిర్మాణానికే
జగం జీవులబాగుకొరకే
జన్మం జనార్ధనుడిసేవకే


కామెంట్‌లు