విప్పలేని ముడులలో
చెప్పలేని సడులెన్నో
కమ్మిన చీకటి మాటున
కప్పుకున్న కలతలెన్నో...
మోడుకు ఊపిరులూది
నీడకు చేర్చాలని
వేడుకున్న మనసులకు
వేడుక దొరికేదెపుడో...
ఘటనల కారణం తెలియక
నటనల అలసిన బ్రతుకున
ఆటగ మారిన అదృష్టం
వేట ఆపేదేన్నడో...
ఎవ్వరి దీవెన అయినా
దివ్వెకు వెలుగుంటే చాలు
నవ్వులు మరచిన పెదవుల
రవ్వల వెలుగొచ్చేదెపుడో....
మూగైన మదిని మాటాడించగా
వేయిగా వేల్పులు తరలివచ్చి
శోధననాపి వేదన తీర్చి
అనుగ్రహించే తరుణం కోసం
వేచిన మదికి
వెన్నెల పంచే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి