ఆవృద్ధదంపతులు పిల్లల కోసం అల్లాడి తపించి శివశివానీల అనుగ్రహం తో పుట్టిన కొడుకు ని చూసి ఆనందంలో మునిగి పోయారు.తల్లి 40రోజులు సుబ్రహ్మణ్యస్వామి ఉపాసన పూజలఫలం ఆపసివాడు! గురువు చిదంబరం శాస్త్రి గారు ఉపనయనం ఐన ఆచిన్నారిని తీసుకుని కాశీలో ఉండి సకలశాస్త్ర పారంగతునిచేశారు.రోజూ గురువు గారి తో గంగా స్నానం చేసేవాడు ఆబాలుడు.ఒకరోజు " నాయనా! ఈరోజు నీవు ఒక్కడివే గంగానది లో అలాసాగిపోతూఉండు.హఠాత్తుగా నీ పాదాలకి ఏదో తగిల్తే వెంటనే వంగి దాన్ని చేతుల్లోకి తీసుకొని నాదగ్గరకు తీసుకుని రా" అని పురమాయించారు.అలాగే ఆశిష్యుడు గురుభక్తి తో గంగానది లో అడుగులేస్తూ కొంత దూరం నడవటం హఠాత్తుగా పాదాలకి ఏదో తగలటంతో చేతులు ముంచి దాన్ని పైకి తీశాడు.అద్భుతం! వీణ చేతుల్లోకి వచ్చింది.జాగ్రత్తగా దాన్ని గుండెలకి హత్తుకుని గురువు ని సమీపించాడు.ఆయన తనధర్మం కర్తవ్యం ముగిసింది అని ఆనందంతో గురువు గంగలో కలిసిపోయారు.ముత్తు ఆయన కి ఓకొడుకులాగా అన్ని అంతిమ సంస్కారాలు చేసి గంగ ఒడ్డున విచారంగా నిలబడ్డాడు.ఓవృద్ధబ్రాహ్మణుడు ఆయువకుడు ముత్తుని సమీపించి " నాయనా! గురువు ఋణం తీరిపోయింది.నోరుతెరు" అని నాలుకపై పటికబెల్లం వేసి మాయమైనాడు.ముత్తు స్వస్థలంకి తిరిగి వచ్చి సంగీత గురువు గా ఎందరికో సంగీత శిక్షణ ఇవ్వసాగాడు.ఆరోజు నైవేద్యం పెట్టడానికి చారెడు బియ్యం తో అన్నం వండలేకపోయానని ఇంట్లో సరుకులు నిండుకున్నాయని బాధపడుతోంది భార్య.కమలమ్మ అనే మహిళ తన నగలు ఇచ్చి సరుకులు తెప్పించుకోమని అనటం విన్న ముత్తు" వద్దు.దైవం ఉన్నాడు చూస్తాడు" అని సంగీత పాఠాలు చెప్పటంలో మునిగి పోయాడు.ఆశ్చర్యం! ఆఊరి పెద్ద తనదగ్గర ఉన్న సరుకుల్ని ముత్తు ఇంటికి పంపడం జరిగింది.ఆకాలపురాజు పట్టపుఏనుగు పిచ్చి ఎక్కి పారిపోయి స్మశానం లో ఘీంకారంచేస్తోంది.ముత్తు వెంటనే " మీనలోచనీ పాశవిమోచనీ" అని పాడటంఆఏనుగు శాంతించటం జరిగింది.ఇక్కడే అద్భుతం జరిగింది.తనుశరీరం విడిచే కాలం ఆసన్నమైంది అని ముత్తు అలా వీణానాదంలో తన గళాన్ని శృతి కల్పుతూ ఎన్నో "కుశ" అనేపదప్రయోగంతో ఎన్నో కృతులు గానం చేసి సంస్కృతంలో అమ్మ వారిని స్తుతిస్తుండగా ఆయనలోంచి ఓదివ్యతేజస్సు అందరూ చూస్తుండగానే అంతరిక్షంలో మాయమైంది.ఆముత్తు ఎవరో??
కొసమెరుపు..గణపతిస్థపతి అద్భుత శిల్పి.ఆయన చెక్కిన శిల్పాలు అపూర్వ దేవతామూర్తుల విగ్రహాలను చూస్తుంటే అలౌకిక ఆనందం పొందుతాం.ఆయనకు స్వయంగా తన కరకమలాలతో శాలువా కప్పారు కంచి పరమాచార్య నడిచే దైవం.👏
ఆయనే సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు.నవావరణకీర్తనలు రాసిన పరమభాగవతోత్తముడు దేవీ ఉపాసకుడు.🌷
కొసమెరుపు..గణపతిస్థపతి అద్భుత శిల్పి.ఆయన చెక్కిన శిల్పాలు అపూర్వ దేవతామూర్తుల విగ్రహాలను చూస్తుంటే అలౌకిక ఆనందం పొందుతాం.ఆయనకు స్వయంగా తన కరకమలాలతో శాలువా కప్పారు కంచి పరమాచార్య నడిచే దైవం.👏
ఆయనే సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు.నవావరణకీర్తనలు రాసిన పరమభాగవతోత్తముడు దేవీ ఉపాసకుడు.🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి