ముద్దొచ్చే ' నికో ' :; --- డా.కె .ఎల్ .వి.ప్రసాద్ .

 నా ముద్దులమనవడు 
అసలు పేరు-
'నివిన్ అయాంశ్.నల్లి!'
మేనమామ పెట్టిన 
ముద్దుపేరు 'నికో '...
అందరూ ఇలానే పిలుస్తారు !
ఇందులో --
నేనెప్పుడూ ప్రత్యేకమే 
నేనుపిలిచే ముద్దుపేర్లు 
అనేకం ...!
' బుజ్జోడా !' అనిపిలిస్తే 
నావైపు తిరిగి చూస్తాడు ,
' బుజ్జన్నా !' అనగానే 
'ఊ ..!' అని ....వెనక్కు తిరిగి 
ఏమిటన్నట్టు చూస్తాడు ,
'బుజ్జాయీ ..!' అన్నానంటే 
వెనక్కి తిరిగి నవ్వుతాడు !
'బుజ్జిబాబూ ..!' అంటే ...
' తాతా ..!' అంటాడు ....
ముద్దు ..ముద్దుగా ,
నా ..మనవడు 'నికో ' బాబు !!
                  ***
కామెంట్‌లు