సతులమతులు పతులపాట్లు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పత్ని ప్రతిరోజూ
చాలా సరుకులుతెమ్మంటది
పట్టీనిచ్చి
ప్రతిదాన్ని పట్తుకొనిరమ్మంటది
లేదంటే
పస్తులు పెడతాననిహెచ్చరిస్తది

భార్య వారానికోమారు
సంతకు డబ్బులివ్వమంటది
ఎన్నోరూపాయలు
నీటిలా ఖర్చుచేస్తది 
స్నేహితులదగ్గరకు
వెళ్ళవద్దంటది ఇంటికితెసుకొనిరావద్దంటది

సతి నెలకోచీర
కావాలంటది
సరిపోయేరవిక
కొనాలంటది
బట్టలకు కుట్టుకూలీకి
భారీగా డబ్బులుతగలేస్తది

పెళ్ళాం ఏడాదికోనగలు
కొనిపెట్టమంటది
పాతనగలును
మారుస్తానంటది
తరుగులు చార్జీలకని
తంటాలుపెడతది

అర్ధాంగి ఓపికలేకున్నా
పనులు చేయమంటది
ఇల్లువిడిచి
బయటకు పోవద్దంటది
పిల్లలదగ్గరకు
పోదామంటే ససేమిరాయంటది

కట్టుకున్నాక
భార్యను భరించాల్సిందేనా
బతుకుబండిని
ఒంటెద్దులాగా లాగాల్సిందేనా
పైసాపైసాలెక్కలు
పత్నికి ప్రతిదినంచెప్పాల్సిందేనా

ఆలికోసం చేపలా
ఏటికెదురుగా ఈదాల్సిందేనా
పక్షిలా
ఎత్తుగా ఎగరాల్సిందేనా
పశువులా
మొండిగా బతకాల్సిందేనా


కామెంట్‌లు