భారత తొలి ప్రధానిగా గొప్ప పరిపాలనాదక్షతతో దేశాభివృద్ధిని సాధించిన స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకొని తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాలాలంకరణ గావించి నివాళులర్పించారు. పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు మాట్లాడుతూ అక్రమంగా జైల్లో బందించిననూ ఆ సమయాన తన కుమార్తె ఇందిరాగాంధీకి సందేశాత్మకఉత్తరాలు రాయడంతో ఆ సారాంశంతో గ్లింప్లెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకం రూపొందిందని ఆయన అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సచివాలయ ఉద్యోగి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ బొల్లా సుధాకర్ మాట్లాడుతూ జైల్లో ఉంటూనే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన మేథాసంపత్తి చాచా నెహ్రూ సొంతమని అన్నారు. చాచానెహ్రూ జీవితచరిత్ర అంశంపై నిర్వహించిన దేశభక్తి గీతాలు, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థిణీ విద్యార్థులు పతివాడ హరిణి, సవిరిగాన శ్రావ్య, గేదెల బాలకృష్ణ, బలగ వెన్నెల, బుద్ధల దీపక్, అంగూరు షణ్ముఖరావు, కొర్లాన రక్షిత, గంగు స్వామిశేఖర్, సిరిపురం రష్మిత, పాత్రో పల్లవి, గంగు ఢిల్లీశ్వరరావులు ఈ షీల్డ్ లను అందుకున్నారు. అలాగే క్రికెట్, కబడ్డీ, ఖోఖో, తదితర పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసారు. అనంతరం శ్రీకాకుళం బాలకథానిలయం నిర్వహించిన అంతర్జాల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఈ పాఠశాల విద్యార్థులకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భోగెల ఉమామహేశ్వరరావు పంపిన ప్రశంసాపత్రాలను ఈ వేదికపై ఉపాధ్యాయుల చేతులమీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖర్, బూడిద సంతోష్ కుమార్, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావు, విద్యా సంక్షేమ కార్యదర్శి బొల్లా సుధాకర్, పాఠశాల ఆయా అల్లాడ సరస్వతి, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు బలగ తవిటమ్మ, బి.ఔదులమ్మ, బుద్ధల మీనా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
పాతపొన్నుటూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి