సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు -687
వ్యంజక వ్యంగ్య న్యాయము
*****
వ్యంజక అనగా అభినయము,వ్యంగార్థమును తెలుపు శబ్దము.వ్యంగ్య అనగా వ్యంజనా వృత్తిచే తెలియదగిన అర్థము.
వ్యంజక వ్యంగ్యము అంటే వ్యంగ్యాన్ని సున్నితమైన విధంగా అభినయిస్తూ చూపడం.

 దీనిని తెలుసుకుని అర్థం చేసుకోవాలంటే ముందుగా ముందు  వేదాధ్యయనానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలి.
 వేదాధ్యయనము చేయడం వల్ల వచ్చే ఫలితం ఫల పదార్థ అవబోధన. అవబోధన అనగా వేద విహిత క్రియా కలాపాల ఆచరణమే ఫలముగా గలిగిన వేద మంత్రార్థావ బోధన.అనగా వేద మంత్రార్థములను బాగుగా తెలుసుకుని అందులో విధింపబడిన క్రియా కలాపములను విధి విధానమున నాచరించుట ఆ ఫల పదార్థావబోధకు మూలము వేదాధ్యయనము అని చెప్పవచ్చును.:ఇలా ఒకదాని కొకటి మూలం అవుతుంటి.
 పైన వివరించిన విషయం అంతా అయోమయానికి గురి చేస్తూ వున్నట్లు వుంది కదా! ముందు మనం వ్యంగ్యం అంటే ఏమిటో చూద్దాం.
వ్యంగ్యము అనగా ఒక నిర్దిష్ట విషయం లేదా ఆలోచనపై దాడి చేయడానికి మరియు విమర్శించడానికి వ్యంగ్యం ఒక పదునైన కత్తి వంటిది.వ్యంగ్యం అతిశయోక్తి మరియు ఎగతాళి వంటి వివిధ పద్ధతులను ఉపయోగించే ఒక సాహిత్య పరికరం. ఈ వ్యంగ్యం విజయవంతం కావాలంటే అది దాడి, తీర్పు, పదజాలం, హాస్యం మరియు సంస్కరణ కోరిక వుండాలి.
వ్యంగ్యము అనేది ఒకానొక మానవ స్వభావము. ఇది సమాజంలోని మూర్ఖత్వాన్ని మరియు దుష్టత్వాన్ని ఎగతాళి చేయడానికి కళాకారులు ఉపయోగించే సాహిత్య పరికరం.
వ్యంగం ప్రపంచాన్ని అద్దంలా చూపిస్తుంది.ఆరోగ్యకరమైన హాస్యం మరియు వ్యంగంతో దాని లోపాలు మరియు లోపాలను ఎత్తి చూపుతుంది.
ఈ వ్యంగ్యం సామాజిక మరియు రాజకీయ సమస్యలను సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా బహిర్గతం చేయగలదు.పేదరికం, అవినీతి,అసమానత వంటి సమస్యలపై దృష్టి సారించేలా పాఠకులను ప్రేరేపించగలదు. పాఠకులలో విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది.
 పాఠకులను అలరించడానికి, నవ్వించడానికి, ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను అర్థం చేసుకునే విధంగా చేస్తుంది.
వ్యంగ్యములో "దాడి, తీర్పు, పదజాలం,తెలివి,హాస్యం సంస్కరణ మరియు ఉద్దేశం వుంటుంది.
 వ్యంగం అంటే ఏమిటో అది నిత్య జీవితంలోనూ, సమాజంలోని  మార్పుకు పాఠకులు మరియు ప్రజలను ప్రేరేపితం చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం.
ఈ వ్యంగ్యాన్ని ప్రదర్శించే తీరునే వ్యంజకము అంటారు. వ్యంగ్యార్థమును తెలుసుకుని దాన్ని సందర్భానుసారంగా వివిధ రకాలుగా ఉపయోగించడమే వ్యంజకము యొక్క లక్ష్యం.
ఇలా "వ్యంజక వ్యంగ్య న్యాయము" అనగా వ్యంగ్యాన్ని అనుకరిస్తూ  సమాజంలోని వివిధ లోపాలను ఎత్తి చూపడం.
 వ్యంగ్యము అంటే ఎలా ఉంటుందో ముందుగా దానికి సంబంధించిన అవగాహన, వివరణాత్మకతను అర్థం చేసుకొని వివిధ రకాలుగా వ్యంజకము ద్వారా ప్రదర్శన చేయమని చెప్పడమే ఈ వ్యంజక "న్యాయము" యొక్క అంతరార్థము.
కాబట్టి దీన్ని ఆచరణలో పెట్టడంలోనే మన విజ్ఞత ,వివేకం సమయం , సందర్భంగా సహాయ పడుతుంది, ఆధారపడుతుంది.

కామెంట్‌లు