అమ్మ : - కోరాడ నరసింహా రావు !
చంద మామ రావె యనుచు
 జాబిల్లి రావె యనుచు
   అమ్మ పెట్టు పాల బువ్వ
  బిడ్డ కెంతో హాయి,ఆనందం

పొత్తిళ్లలొ పాలు పట్టి
  వేకువనే నలుగు పెట్టి 
    ఒళ్లురాసి , నీళ్లు పోసి
     ఊయలూపిజోలపాడు
       అమ్మే నా నేస్తము
        లేరు వేరు దైవము! 

బిడ్డ కడుపు నిండితే.... 
  అమ్మ కడుపు నిండి నట్టే
      బిడ్డకే కష్టము వచ్చి నా
       అమ్మ కుమిలి పోవును

బిడ్డల సుఖమే... 
  తన సుఖకముగ.. 
   మురిసి పోవు అమ్మ 
   అమ్మలేక నరకమే జన్మ !! 
      *******


కామెంట్‌లు