న్యాయాలు -649
మహిషీ ప్రసవ న్యాయము
******
మహిషీ అనగా గేదె. ప్రసవ అనగా కనుట ,పుట్టుట, సంతతి, బిడ్డ, పువ్వు ,పండు అనే అర్థాలు ఉన్నాయి.
మహిషీ ప్రసవ అనగా గేదె / బర్రె బిడ్డను కనుట అని అర్థము.
ఎందుకో గానీ మన పెద్దవాళ్ళలో కొందరికి 'గేదె ప్రసవం' అంటే చిన్న చూపు వుంది.గేదె ప్రసవం చాలా తేలికగా జరుగుతుందనే అర్థంతో "బర్రె ఈనినట్లు" అంటూ సులభంగా లేదా తేలికగా జరిగే పనితో పోల్చి చెప్పారు.
ఎవరైనా ఏదైనా కష్టసాధ్యమైన పనిని/ కార్యాన్ని చిటికెలో సాధించుకొని వస్తే "బర్రె ఈనినట్లు" భలే త్వరగా పూర్తి చేశావే! అని వెనుకటి రోజుల్లో అనేవారు.
కానీ ఏ జంతువుకైనా ప్రసవం నరకయాతనే.ప్రసవం అంటే మరో జన్మ ఎత్తాల్సిందే.పాపం "బర్రె ఈనినట్లు" అనడం వినడానికి మనుసుకు కష్టంగానే ఉంది. కానీ ఏం చేస్తాం దాని ప్రసవం మీద కూడా ఓ న్యాయమును సృష్టించడం ఆశ్చర్యం .మరి ఆ బర్రె లేదా గేదె మానవాళికి చేస్తున్న సేవ ఏమిటో తెలుసుకుందామా....
బర్రె లేదా గేదె పశు జాతిలో ఒక రకమైన పశువు.దీనిని ఎక్కువగా పాల కోసం పెంచుతారు. దీని పేడతో పిడకలు చేస్తారు.గోబర్ గ్యాస్ తయారు చేస్తారు. ఈ గ్యాస్ ను ఎక్కువగా పల్లెల్లో ఉపయోగిస్తారు.
మొదట్లో ఇవి అడవిలోనే జీవించేవి. మానవుడు ముఖ్యంగా పాలు ,వ్యవసాయం కోసం వీటిని కూడా పెంచుకోవడం మొదలు పెట్టాడు.సాధారణంగా ఇవి నలుపు ,బూడిద రంగులో ఉంటాయి.వీటి కొమ్ములు వడి తిరిగి ఉంటాయి. వీటితో సంగీత వాయిద్యాలు, ఎముకల ఆభరణాలు తయారు చేస్తారు. భారత దేశంలో సుమారుగా 17 రకాల గేదెల జాతులు ఉన్నాయి. భారత దేశంలో ఎక్కువగా పాల ఉత్పత్తి గేదెల వల్లనే జరుగుతోంది.
అయితే పురాణాలలో మగదైన దున్నపోతును చెడుకు ప్రతీకగా చూస్తారు.యమధర్మరాజు దున్నపోతుపై స్వారీ చేస్తూ ప్రాణాలు తీయడానికి వస్తాడని అంటారు.
జానపద కథల ప్రకారం మహిషాసురుడు సగం గేదె రూపంలో,మరో సగం రాక్షస రూపంలో ఉంటాడు. అతడిని సంహరించి దుర్గామాత మహిషాసుర మర్ధినిగా పేరు గాంచడం మనందరికీ తెలిసిందే.
ఇక విషయానికి వద్దాం.
ఎంత తేలిగ్గా పూర్తి అయ్యే పని అయినా "గేదె ప్రసవంతో పోల్చకుండా ఉంటే బాగుండేదని అనిపించింది.అయితే ఆనాటి వారు తాము తమ చుట్టూ చూసిన ప్రపంచంలో వివిధ జంతువుల్లో గేదె ప్రసవం తేలికగా అనిపించ వచ్చు.
మన పెద్దలు"మహిషీ ప్రసవం" అనేది ఓ న్యాయంగా చెప్పడంతో ఆ మహిషి గురించి కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకోగలిగాం.కదండీ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి