శ్లో:! మా గచ్చస్త్వమిత స్తతో గిరిశ భో మయ్యేవ వ్యాసం కురు
స్వామిన్నాదికిరాత మామక మనః కాంతార సీమాంతరే
వర్తంతేబహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ
స్తాన్హత్వా మృగయా వినోదరుచి తా లాభంచ సంప్రాప్స్యసి !!
భావం: కైలాసంనందు శయనించే ఓ ఆదికిరాతా ! ఈశ్వరా ! నీవు నా మనసు నందే నివసించిన నీకు రెండు లాభములు ఉన్నవి. నా మనసు అనే అడవిలో కామ, క్రోధ, మోహ,మద, మాత్సర్యములు,అను క్రూర జంతువులు ఉన్నవి.
వాటిని వధించి నీ వేట అను వినోదమును తీర్చుకొన వచ్చును. నన్ను సత్య సంపన్నునిగా
చేయవచ్చును.
******
శివానందలహరి: -కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి