కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సన్మానం..

 మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో గురువారం రోజు 'బాలల దినోత్సవం' సందర్భంగా ముగ్గురు పాఠశాల విద్యార్థులను పోలీసు శాఖ, లయన్స్ క్లబ్ సభ్యులు సంయుక్తంగా కలిసి ఘనంగా సన్మానించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉత్తమ విద్యతో పాటు క్రీడాల్లో రాణిస్తున్న 7వ తరగతి విద్యార్థిని అనన్య యాదవ్ తో పాటు ఇంటి వద్ద సెలవు దినాల్లో తల్లిదండ్రులకు వ్యవసాయంలో తోడ్పాటు అందిస్తున్న విద్యార్థి అక్షయ్ ను, రాజస్థాన్ రాష్ట్రం నుంచి సెటిలార్ గా వచ్చి మండల కేంద్రంలో హోటల్ నిర్వహించుకుంటున్న తల్లిదండ్రులకు సేవలను అందిస్తున్న విద్యార్థిని హీనలను 'బాలల దినోత్సవం' పురస్కరించుకుని ప్రత్యేకంగా గుర్తించి సన్మానించారు. అలాగే మరికొంతమంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ చవాన్ రాజేందర్, ఏఎస్సై తొగర్ల సురేష్, ముప్కాల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల నర్సయ్య, విద్యా సాగర్, ముస్కు రాజేశ్వర్, చాకు లింగం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు..
కామెంట్‌లు