ఏరుగట్ల విద్యార్థి శ్రీనిధి కి బాలరత్న పురస్కారం

 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలాకర మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్  హైదరాబాద్ వారు జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో  jఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బాలరత్న పురస్కారం అందివ్వడం జరుగుతుంది.2024 సంవత్సరానికి గాను ఏరుగట్ల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీ నిధి బాలరత్న, పురస్కారాన్ని అందుకుంది..కరాటే రంగంలో చక్కని ప్రతిభ కనబరిచి అనేక ప్రశంసలు పొందడమే కాక బ్లాక్ బెల్ట్ సాధించడం, సాహిత్య రంగంలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నందుకు, ఈ పురస్కారాన్ని  హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో మంగళవారం సాయంత్రం పురస్కార సభలో ముఖ్య అతిథులు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టర్ ఆచార్య గౌరీ శంకర్ గారు, హైకోర్టు అడ్వకేట్, ఆర్.టి.ఐ పూర్వ కమిషనర్ శ్రీ విజయ బాబు గారు, ఇతర పెద్దల చేతుల మీదుగా బాలరత్న పురస్కారాన్ని అందుకున్నదని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణాచారి తెలిపారు, ఇంత గొప్ప పురస్కారాన్ని సంపాదించడమే కాకుండా పాఠశాల పేరును, గ్రామ పేరు దశ దిశల వ్యాప్తి చేసి అందరి మన్ననలు పొందిన శ్రీనిధి ని పాఠశాల ఉపాధ్యాయులు  మునిరుద్దీన్ పవన్ ప్రసాద్ ప్రవీణ్ శర్మ, రాజనర్సయ్య రాజేందర్ గంగాధర్ రాజశేఖర్ శ్రీనివాస్ సబిత ఇందిరా నరేష్ రాజగోపాల్ ట్వింకిల్ జ్యోతి మరియు గ్రామస్తులు అభినందించారు.
కామెంట్‌లు