అక్కడ వెన్నెల కాసేపు
సేదదీరిందా వెలుగై
నిలబడ్డ చెట్టు నీడ నీడలో చల్లగా
చీకటిలో వెలుగు పరుచుకున్నది
స్వర్ణకారుడు దిద్దిన తెల్ల మొలతాడు వెండికిరణాల
కార్తీక పున్నమి వెలుగుల దీపాలు
ఎర్ర సముద్రపుటలలెత్తిన రక్తం
అలవోకగా ప్రపంచాన హద్దులు చెరిపిన జీవక్రియను
హరివిల్లు వెనుకున్న తెల్ల దారంపోగు నేను
అక్కడ కాసేపు ఆగు చూడు
వేళ్ళూనిన వృక్షాల లోపలి మనసు
ఊరై గూడై వాడై వాడని పూల ఛాయ వెలిగే
ఆగూ... అక్కడ కాసేపు చూడు
కవిత ఓ కల! తనివితీరని దాహ చెలిమె
శిలలో శిల్పం ఆమె అభివ్యక్తి నేస్తం
ఆహా! ఓహో!పదాలకందని ఆకాశదీపం
వీచే గాలిలో గలగల తెల్ల చేమంతి మిలమిల

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి