బాల్యం బహుమతి :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
నాలో నీలో  
నవ్వే పొలంలో ఎగిసి ఎగిరే మొలక 
విరిసే బతుకు బహుమతి బాల్యం

దౌడు తీపి మెరుపు పసితనం
ఎప్పటికీ ఎన్నటికీ బాల్యం
కరుగని నీరుగారని ఐస్కూట్ పుల్ల అది

నడక నడతల నాన్న
పసితనం కమ్మలు ఎగిరేసే కనుబొమ్మల నజరాన

నీ కవితలో కనులు
అమ్మానాన్న మూయని రెప్పల మాటున
ఆ కనుకొలుకుల తడి
తెలియని చెరుగని చిరునవ్వు 

నీలో లేని నీ బాల్యం
నాలో వేలిగే శైశవ నాట్యం
ఆలపించు రోజూ నీ గొంతుల 

రాస్తున్న కవితలో నీవు నాన్నా
నాలో మమతల మూట
నీవు పాడిన పాటలో నేను 
రంగుల హారివిల్లు రువ్వే చిరునవ్వుల సితార
బతుకు బహుమతి బాల్యం

ప్రవాహంలో అమేయ లేలేత రెటీనా దృశ్యం 
 పిలిచిపలికే తడితడి తాతంచు వాన గుండెలయ

ఆటపాటల దరువు పూసే  కలల కావ్యంలో అమ్మూ బాల్యం 
అమ్మా అమ్మమ్మ ఊరేగే ఊపిరి మొలక

======================================
(బాలల దినోత్సవ సందర్భం నేడు)

కామెంట్‌లు