కాలినడక:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఇక్కడ నడుస్తున్న దారులు
ఎదురెదురుగా, పక్కపక్కనా కాదు
ఎవరికీ తెలియని స్వేచ్ఛగాలిలా ఇద్దరు

కలువని రైలు పట్టాల దారిలో
కలుసుకునే చౌరస్తా అది
వివిధ భాషల ప్రపంచంలో
విశాల భావోద్వేగాల ముషాయిరా

రంగుల సినిమా కాదు 
రంగురంగుల ఇంద్రధనుస్సు ఇది 
అంతరంగ కాంతులీనే ధవళ వర్ణ కిరణం

మనిషిలోకం తిరిగే విద్యుద్దీప శిఖ
మట్టినీ మనిషిని ప్రేమించే చలన శిఖరం
ఇద్దరూ ఒకటిలా కనిపించని అనంత వెలుగు 

మనిషిని మనిషిగా నిలిపే 
ఆశలు వెలిగే కొత్త దారి వలయంలో
సాగే కాలినడక ఇద్దరంటే అనేకం

ప్రజాస్వామ్య దేశంలో జాతి
ఉనికీ ఊపిరి దారులు
భిన్న ఆలోచన భేదాభిప్రాయంలో 
ఇద్దరు మాత్రమే కాదు సకలం


కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Excellent poetic diction following and flowing with the poetic emotion based not only on mere structure of roads but also on patriotic feeling towards our nation where individual freedom is equally respected besides sd social conduct. Hats off..
prasadklv చెప్పారు…
మీరు కవిత చెప్పిన విధానం అద్భుతం.
కాలినడక అంటూనే మీరు మీ కలాన్ని నడిపించిన తీరు అభినందనీయం సుమండీ.