న్యాయములు -691
వ్యాఘ్రోపవాస న్యాయము
****
వ్యాఘ్ర అనగా పులి. ఉపవాస అనగా పస్తు, భోజనము చేయకుండుట అని అర్థము.
"వ్యాఘ్రస్య తూపవాసస్య పారణం పశు మారణమ్ " అనగా పులి ఉపవాసమునకు పారణము పశు శూరణమే.అనగా ఉపవాసానంతర భోజనం కంద దుంపలా జంతువును తినడమే. అలాగే దుష్టుని సవినయానుసరణమునకు పరిణామము ధనమాన ప్రాణాపహరణమే అని అర్థము.
అలాగే దుష్టుడు ఉపవాసం ఉండటమంటే అతడి దృష్టి, తదనంతర పరిణామం ఎవరిదో ధనానికో,మానానికో,ప్రాణానికో ముప్పు అన్న మాటే.
మనం ముందుగా ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉప అంటే దగ్గరగా అనీ,వాసం అంటే నివసించడమని అర్థము. మొత్తంగా ఉపవాసం అంటే ఆధ్యాత్మిక వాదుల దృష్టిలో భగవంతునికి దగ్గరగా నివసించడం.
ఆ రోజు ఎలాంటి ఆహార పానీయాలను తీసుకోకుండా ఈ దీక్షను ఒకపూట లేక ఒకరోజు ఇంకా లేదంటే కొన్ని రోజుల వరకు చేబడుతుంటారు.
మరి పులి దేనికి సంకేతం.పులులు తరచూ శక్తి, ధైర్యం మరియు బలానికి సంకేతంగా భావిస్తారు. అడవుల్లో నివసించే పులి పిల్లి జాతికి చెందినది.భారీ తల,బలమైన ముందరి కాళ్ళు మరియు దాని తోక దాని శరీరం కంటే దాదాపు సగం పొడవు ఉంటుంది.ఇది సింహానికంటే సాహసి.ఎందుకంటే సింహం ఎక్కువగా బృందంతో కలిసి వేటకెళుతుంది. కానీ పులి మాత్రం ఒంటరిగా నే వెళుతుంది.
పులులు ఎక్కువగా క్షీరదాలను తింటాయి.ముఖ్యంగా 60-250 కిలోల బరువు ఉండే గిట్టల జంతువులను తింటాయి.
పులి ఒక్క సారి వేటాడిందా కనీసానికి నలభై కిలోల మాంసాన్ని సులభంగా తింటుందట.అలా తిన్న పులి ఒకోసారి వారం దాకా ఆహారం తీసుకోకుండా ఉంటుందట.
మరి మాంసాహారి మరియు కౄరమైన పులి ఉపవాసం వుంటుందా అంటే పైన చెప్పిన విధంగా పులి ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల మళ్ళీ వేటకు మధ్య కొంత సమయం తీసుకుంటుంది.
ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పైన వివరాలన్నీ తెలుసుకొన్నాం కదా.పులి ఉపవాసం ఉంది అంటే ఇక ఏ జంతువుకో మూడినట్టే అని అర్థము చేసుకోవాలి.
ఈ "వ్యాఘ్రోప వాస న్యాయము"లో ముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇందులో ఉపవాసం ఉన్న పులితో దుష్టుడిని పోల్చి చెప్పడం.జంతువులను వేటాడటం పులి సహజ గుణము.కానీ మనిషి అలా కాదు కదా! పులి తన జాతికి( పులుల )హాని చేయదు.కానీ మనుషుల్లో కొందరు మాత్రం భయంకరమైన దుష్టత్వంతో తోటి మనుషుల ధన,మాన, ప్రాణాలను హరణంతో పాటు హననం చేస్తున్నారు. పులి కౄరత్వం దాని రూపంలో కనబడుతుంది.కానీ మనిషి కౄరత్వం దుష్ట స్వభావం తెలుసుకోవడం కష్టం.
కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి వారిని అంతర్నేత్రంతో కనిపెట్టి దూరంగా ఉండాలి. దూరంగా ఉంచాలి. ఇది ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి