ఒకప్పుడు యువకుల నుంచి వృద్ధుల వరకూ చదువొచ్చిన వారి చేతుల్లో పుస్తకాలు కనిపించేవి. ప్రయాణాల్లో, తీరిక సమయాల్లో ప్రశాంతంగా పుస్తకాలు చదువుకునేవారు. ఈ అలవాటుకు టీవీలు బ్రేకులు వేస్తే.. తర్వాత వచ్చిన సెల్‌ఫోన్లు ఏకంగా అడ్డుకట్టలే కట్టేశాయి. ఈ పరిస్థితులే అనేక ఒత్తిడులకు కారణమవుతున్నాయని, వాటికి మంచి పుస్తక పఠనం దివ్య ఔషధం అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కథల పుస్తకాలు పిల్లలో ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చూడటం కన్నా చదువడం వల్ల మంచి రసానుభూతిని పొందుతారు. పెద్దలు నిత్యం కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తూ పిల్లలకు అలవాటుగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఉన్నత శిఖరాలు చేరవచ్చు.జ్ఞాన సముపార్జనలో కీలకమైన పఠనానికి పునాదులు పడాల్సింది బాల్యంలోనే. పాఠశాల విద్యాభ్యాసంలో పఠనం అనేది ప్రవేశ ద్వారం లాంటిది. అలాంటి పఠనా సామర్థ్యమే లేకుంటే విద్యాభ్యాసానికి ద్వారాలు మూసుకుపోయినట్లే. పదేళ్ల వయస్సు వచ్చే సరికి చదవడం రానివారు పాఠశాల విద్యానంతరం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అమెరికా, న్యూజిలాండ్, ఫీన్లాండ్, ఇంగ్లాండ్, కెనడా, సింగపూర్ దేశాలలో ఎన్ని పుస్తకాలు చదివామో చెప్పుకోవడం గొప్పతనంగా భావిస్తారు. ఆంగ్ల బోధనలో భాగంగా అక్కడ పుస్తక పఠనం ఒక పాఠ్యాంశం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. పాఠశాలలో పుస్తకాలు చదవడం, వాటిని విశ్లేషించడం, రివ్యూలు రాయడం వంటివి నిత్యకృత్యాలు. ముఖ్యంగా నవలలు, కథలు, కవితలు ఇతర పుస్తకాలు విద్యార్థులతో చదివిస్తారు.ముఖ్యంగా తల్లిదండ్రులు… కనీసం రోజులో ఒక గంట సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తే పిల్లలు కూడా వారిని అనుసరించి పుస్తకాలు చదువుతారు. ఖాళీ సమయాలలో విద్యార్థులను పుస్తకాల షాపులకు, పుస్తక ప్రదర్శనలకు, పౌర గ్రంథాలయాలకు, నూతన పుస్తక ఆవిష్కరణలకు, పుస్తక విశ్లేషణలకు తీసుకెళ్లి పుస్తకాలపై మక్కువ పెంచి పుస్తక పఠనం వైపు వారి దృష్టిని మరల్చే ప్రయత్నం చేయాలి.ప్రతిరోజు కనీసం ఆరు నిమిషాలు పుస్తకం చదివితే హృదయ స్పందనతో పాటు కండరాలపై ఒత్తిడిని 60 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సంగీతం, టీ తాగడం, నడక, వీడియోగేమ్‌లు ఆడడం వంటి వాటి కంటే.. ఒత్తిడిని ఎదుర్కోవడానికి పుస్తకపఠనం మంచిదని యూకేలోని ‘ససెక్స్’ విశ్వవిద్యాలయం గతంలో నిర్వహించిన పరిశోధనలో తేలింది.మీరు చదువుతున్నప్పుడు మీ దృష్టి అంతా పుస్తకంపైనే ఉంటుంది. బాహ్య, అంతర్గత ఆలోచనలు ఆగిపోతాయి. ఒకే ఎజెండాను కలిగి ఉన్నప్పుడు మెదడులోని అన్ని ఇతర భాగాలు పునరుజ్జీవం పొందే అవకాశం కలుగుతుంది. అన్ని ప్రతికూల ఆలోచనల వడపోత జరుగుతుంది. అందుకే ధ్యానానికి మించిన ప్రత్యామ్నాయంగా కొంతమంది పుస్తకాలు చదివి ఒత్తిడి నుంచి బయట పడతారు.
పుస్తక పఠన :-సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి