చాచా నెహ్రూ చక్కని వాడు
నేర్పు ఓర్పు తీర్పుతో
ఎద మీద గులాబీ తో
ఎంతో మంచి వాడు మన నెహ్రూజీ
ఆటలు ఆడిస్తూ పాటలు పాటిస్తూ
పిల్లల మాటలతో మల్లెలు పూయిస్తూ
సుగుణాల సువాసన వెదజల్లే
పిల్లల తాత మన నెహ్రూజీ
ప్రీతిక చెప్పులు కథలెన్నో
రోజు రోజు రోజా పువ్వుతో
చిరునవ్వులను కురిపించు
మరపురాని మన నెహ్రూజీ
పిల్లల మనసున మల్లెలు పూయించి
మంచి మాటల మాలలు కట్టించి
సరస్వతి మెడలో వేయించిన
పిల్లల నేస్తం మన నెహ్రూజీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి