పుణ్య చరిత! అచ్యుతుని రాజ్యశ్రీ

 అభంశుభం తెలీని పసిది తెలుగింటి ఆడబిడ్డ విధికితలొంచిన పుణ్య చరిత జీవితం ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి గొప్ప గురువు నిపొందిన భాగ్యశీలి! 9వ ఏట తండ్రి 10 వ ఏట తల్లిని 12 వ ఏట భర్తను కోల్పోయింది.దురదృష్టవంతురాలు నష్టజాతకురాలు అని స్వజనం బంధువులు ఈసడిస్తే చుట్టు ప్రక్కల వారు ఆమె కంటపడితే మహాపాపం అరిష్టం అని భావించిన రోజులవి. చప్పిడి తిండి ఒంటిపూట భోజనం చీకటి గదిలో అలా చాపపై జీవచ్ఛవంలా పడుంది ఆచిన్నారి.
2తనకొక గురువు కావాలి అనే భావం చిన్నారి లో 
తపన ఏదో ఆవేదన! ఓరోజు ఓసిద్ధపురుషుడు
పద్మాసనంలో దివ్య కాంతులు వెదజల్లుతూ కనపడ్డాడు.కాలు బైట పెట్టలేని స్థితిలో ఆమె ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయింది.
ఓరోజు బైట ముగ్గు వేస్తున్న ఆచిట్టితల్లిపై " హు! జుట్టు ఎందుకు భర్త పోయిన దానికి!?" అని మాటల ఈటెలు విసిరేవారు ఇరుగుపొరుగు.ఆబాధ భరించలేక "అన్నయ్యా! నేను తిరుపతి వెంకన్న దగ్గర గుండు కొట్టించుకుంటాను" అని గొడవ చేసేది రోజు.
3 ఎన్నో సార్లు తిరుపతి ప్రయాణం ఏదోఒక ఆటంకం రావడంతో ఆగిపోయింది.దైవానుగ్రహంతో ఆమెతనకు కన్పించే సిద్ధ పురుషుని దర్శించి ధన్యురాలైంది.ఆమహాపురుషుని ఒకేఒకమాటని ధైర్యం కూడగట్టుకుని అడిగింది " నన్ను తరింపజేయండి స్వామీ". మౌనం వీడి అన్నారాయన " అలాగే". ఆయన దినచర్యను ప్రతిపనిని మాటను
ఆమె రాసేది.అలా అవి పబ్లిష్ చేయబడటం మన అదృష్టం. ఆగురువు కేవలం బాగా తెల్లగా తెల్లారాక
రానిచ్చేవాడు.సాయంత్రం 6కాకముందే పంపేసేవాడు.అప్పటికే పండు వృద్ధులాయన!
ఆయనశరీరంవిడిచాక ఆమె కాశీకి వెళ్ళారు అన్న కుటుంబం తో!
4" అక్కడ ఎవరైనా ఆమెను ప్రశ్నిస్తే గురుసేవ లో తరించాను అని వచ్చీరాని హిందీ లో జవాబిచ్చేది ఆమె.కాశీవిశ్వనాధాలయం కాపలాదారుడు ఆమెను చూస్తూనే" అమ్మా! నాకు బైట పనుంది.ఈవెండిసామాన్లు జాగ్రత్త!"అని చెప్పి వెళ్లిపోయాడు.దాదాపు రెండు గంటల తర్వాత వచ్చిన చెల్లి ని అడిగాడు అన్నగారు" ఎందుకింత ఆలస్యం ఐంది " అని.జరిగిందంతాచెప్పిందామె." చెల్లీ! నీజన్మ ధన్యం.స్వయంగా  కాశీ విశ్వనాథుడే కాపలాదారు రూపంలో నిన్ను తరింపజేశాడు". ఇలాంటి అతి సామాన్య బాలిక ఓరచయిత్రిగా ఎదిగి
గురువుని గూర్చి విశేషాలు చెప్పిన ఆమె ఆదర్శ శిష్యురాలు.
5 ఆపుణ్యచరిత విజయవాడ లో పుట్టి రమణా శ్రమ ంలో తరించింది.సూరినాగమ్మగారు రమణమహర్షి దినచర్య ఆయన తత్వం భావాలు లేఖలరూపంలోరాసి అమరులైనారు...
కామెంట్‌లు