మేము ఇప్పటి వరకు
చీకటిరాత్రి, కాళరాత్రి,నిశిరాత్రి
అర్ధరాత్రి, నలుపురాత్రి,భయంకరరాత్రి
లాంటి పదాలే విన్నాం!
కానీ…!
కృష్ణరాత్రి, వెన్నెలరాత్రి, ఆనందరాత్రి,
వసంతరాత్రి,కల్యాణరాత్రి,కమనీయరాత్రి
ఆటలరాత్రి, పాటలరాత్రి లాంటి పదాలు
ఇప్పుడే అవగతమౌతున్నాయి
మేమింతవరకూ రాత్రినాణేనికి
ఒకవైపే చూశాం కానీ,
మేమిప్పుడు రెండోవైపున కూడా చూస్తున్నాం!
రాత్రి ఆటలు, రాత్రి పాటలు,
రాత్రి పెళ్ళిళ్ళు, రాత్రి సందళ్ళు,
రాత్రి అలకలు, రాత్రి సరాగాలు
అబ్బో!
ఎన్నెన్ని సంతోషాల ఛటలో కదా?!
కృష్ణుని బృందావన క్రీడలు,
యమునలో కాళింది పడగపై నాట్యాలు,
గోపికలతో దాగుడుమూతలు,
బాల రాముని చంద్రదర్శనాలు,
వెన్నెల్లో సైకత విహారాలు,
రాత్రి భోజనాలు, మిత్రులతో విందులు
అబ్బో! ఎన్నెన్నో
మా మనస్సుల్లో దర్శించాం, అనుభవించాం!
ఇప్పుడు మాకు
చీకటి రాత్రుల భయంలేదు!
రాత్రంటే….
అనుభవాల సంతోష చంద్రోదయాలే!
చీకటంటే….
అనుభూతుల చర్వణమే!
అందుకే….,
అన్నీ శుభరాత్రులే మాకు!!
**************************************
చీకటిరాత్రి, కాళరాత్రి,నిశిరాత్రి
అర్ధరాత్రి, నలుపురాత్రి,భయంకరరాత్రి
లాంటి పదాలే విన్నాం!
కానీ…!
కృష్ణరాత్రి, వెన్నెలరాత్రి, ఆనందరాత్రి,
వసంతరాత్రి,కల్యాణరాత్రి,కమనీయరాత్రి
ఆటలరాత్రి, పాటలరాత్రి లాంటి పదాలు
ఇప్పుడే అవగతమౌతున్నాయి
మేమింతవరకూ రాత్రినాణేనికి
ఒకవైపే చూశాం కానీ,
మేమిప్పుడు రెండోవైపున కూడా చూస్తున్నాం!
రాత్రి ఆటలు, రాత్రి పాటలు,
రాత్రి పెళ్ళిళ్ళు, రాత్రి సందళ్ళు,
రాత్రి అలకలు, రాత్రి సరాగాలు
అబ్బో!
ఎన్నెన్ని సంతోషాల ఛటలో కదా?!
కృష్ణుని బృందావన క్రీడలు,
యమునలో కాళింది పడగపై నాట్యాలు,
గోపికలతో దాగుడుమూతలు,
బాల రాముని చంద్రదర్శనాలు,
వెన్నెల్లో సైకత విహారాలు,
రాత్రి భోజనాలు, మిత్రులతో విందులు
అబ్బో! ఎన్నెన్నో
మా మనస్సుల్లో దర్శించాం, అనుభవించాం!
ఇప్పుడు మాకు
చీకటి రాత్రుల భయంలేదు!
రాత్రంటే….
అనుభవాల సంతోష చంద్రోదయాలే!
చీకటంటే….
అనుభూతుల చర్వణమే!
అందుకే….,
అన్నీ శుభరాత్రులే మాకు!!
**************************************

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి