ప్రణయగీతం ఆలపించనా
ప్రబోధగీతం వినిపించనా
విప్లవగీతం ఆకర్ణించనా
విరహగీతం వీనులకందించనా ||ప్రణయ||
జోలపాటపాడి జోకొట్టనా
లాలిపాటపాడి లాలించనా
భక్తిగీతంపాడి పరవశపరచనా
భావగీతంపాడి భ్రమింపజేయనా ||ప్రణయ||
అందాలగీతం పాడనా
ఆనందగీతం అందించనా
జానపదాలు వల్లెవేయనా
పౌరాణికాలు ప్రవచించనా ||ప్రణయ||
మనసుపాటలుపాడి ముచ్చటపరచనా
సొగసుపాటలుపాడి సంతృప్తిపరచనా
పెళ్ళిపాటలుపాడి ప్రోత్సాహపరచనా
పూలపాటలుపాడి పరిమళాలుచల్లనా ||ప్రణయ||
తెలుగుపాటలుపాడి తృప్తినికలిగించనా
తేనెపాటలుపాడి తీపినిక్రోలుకోమందునా
పాతపాటలుపాడి పాతఙ్ఞాపకాలుతట్టనా
కొత్తపాటలుపాడి కొంగొత్తరుచులుచేర్చనా ||ప్రణయ||
పిల్లలపాటలుపాడి ప్రమోదపరచనా
పెద్దలపాటలుపాడి సుద్దులుతెలపనా
హాస్యపాటలుపాడి నవ్వులుచిందించనా
శృంగారపాటలుపాడి వలపుకోర్కెలులేపనా ||ప్రణయ||
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి