తారాజువ్వలు పిల్లలు:- -బాలబంధు డా.గద్వాల సోమన్న
ఎగిసే తారాజువ్వలు
ఎగిరే శాంతి కపోతాలు
ముద్దులొలుకు చిన్నారులు
ముద్దబంతి సోయగాలు

ఎదిగే పచ్చని మొక్కలు
ఒదిగే అందాల గువ్వలు
పసి పిల్లలను పరికింప
నింగిని వెలిగే తారలు

పారే యేరుల సవ్వడులు
ప్రాకే మెత్తని తీగలు
కురిసే తొలకరి చినుకులు
విరిసే తెల్లని మల్లెలు

ఉన్నతమైనవి తలపులు
ఉత్తమమైనవి బుద్ధులు
తేనెలొలికే పలుకులు
వీణ నాదమే స్వరములు

జువ్వల మాదిరి ఘటికులు
రవ్వల హారము మనసులు
తారాజువ్వల వెలుగులు
కిలకిల నవ్వే బాలలు

పిల్లలు ఇంటికి దివ్వెలు
గణగణ మ్రోగే మువ్వలు
వారుంటేనే కళకళ
మాటలేమో గలగల


కామెంట్‌లు