ప్రపంచంలో నిరంతర సాహిత్య సాంస్కృతిక ప్రభంజన సంస్థ ఐన
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కవితల పోటీలలో కుదమ తిరుమలరావు విజేతగా నిలిచి మరో ఘనత సాధించారు.
ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన తొలి సాహితీ సంస్థ ఐన శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో తిరుమలరావు పాల్గొని విజేతగా నిలిచారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీ కేంద్రంగా అంతర్జాలం ద్వారా బాల్యం అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలలో బొమ్మరిల్లు అనే కవితను పంపిన తిరుమలరావు విజేతగా నిలిచారు. 32 ప్రపంచ రికార్డులను సాధించిన ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీభూషణం, జాతీయ కో ఆర్డినేటర్ నూక సంపత్, జాతీయ సోషల్ మీడియా ప్రతినిధి నల్లా భాగ్యలక్ష్మి తదితరులు తిరుమలరావును అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపారు. బొమ్మలకే పెళ్లి చేయు బొమ్మరిల్లు బాల్యదశ సొంతమని, పసితనాన చేసే చేష్టలు భోగభాగ్యాలకైనా సరితూగని అమూల్యమని తిరుమలరావు తన బాల్యం కవితలో రచించారు.
దేవుడు చెక్కిన ఈ జీవకోటి అనేది బొమ్మలాంటి వింతాట అనీ, నిజానికి జీవితమే అసలుసిసలైన బొమ్మలాట అంటూ కొసమెరుపుగా తన కవితలో చాటిచెప్పారు. తిరుమలరావు విజేతగా ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి