ధీమా ...!! ---డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 పదిన్నరకు -
పాలుత్రాగుతాడు ,
అది పూర్తికాగానే
క్షణం ఆలశ్యంకాకుండా 
నిద్రలోకి జారతాడు'నికో' !
పక్కన ఎవరైనావుండి
మధ్యమధ్యలో జోకొడితే
నిద్ర మధ్యాహ్నం వరకూ
కొనసాగుతుంది...
లేకుంటే -
ఏడుపుతో మొదలై
అల్లరి వూపందుకుంటుంది!
ఆ..తర్వాత 
అన్నం తినిపించడం 
ఒకమహాయజ్ణం...
నూరు శాతం గెలుపు 
మనవడు 'నివిన్' దే...
అవుతుంది.....!
తాత తనపక్షమేఅన్నట్టు
రక్షణ వలయంలొవున్నంత
ధీమా వ్యక్తం చేస్తాడు....
తాతవడికి చేరిపోతాడు 
మనవడు ' నికో'....!!
                 ***
కామెంట్‌లు