మొలక పెసర్లు :- ఎడ్ల లక్ష్మి, సిద్ధిపేట
పాపయ్య తాత వచ్చాడు 
పెసర్లు కొన్ని తెచ్చాడు 
గుప్పిలి నిండా పట్టాడు 
చుట్టూ తిరిగి చల్లాడు 

వాన జల్లు కురిసింది 
చల్లిన పెసర్లు తడిచాయి 
తెల్లగా నామం చేశాయి 
చిన్న మొలక మొలచాయి 

చిగురుటాకులు వేశాయి 
చిన్నగా మొక్కగా ఎదిగాయి 
మొగ్గ వేసి పూశాయి 
గుత్తులు గుత్తులుగా కాసాయీ

ఎండకు అవి ఎండాయి 
అమ్మమ్మ తాత చూశారు 
కాయలన్నీ తెంచారు 
గొంగట్లో వేసి కొట్టారు 

పెసర్లు తడిపి కట్టారు 
చక్కగా మొలకలు వచ్చాయి 
పిల్లలు పెద్దలు తిన్నారు
అందరు ఆరోగ్యంగా ఉన్నారు

కామెంట్‌లు