యుటీఎఫ్ నూతన కార్యవర్గం ఎంపిక

 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన వారంతా మిక్కిలి అంకిత భావంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. రాజాం డివిజన్ స్వర్ణోత్సవ మహాసభల వేదికపై రాజాం మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్ ,ఈశ్వరరావులు ఎన్నికల అధికారులుగా, జిల్లా కార్యదర్శులు బి.రామినాయుడు, పక్కి వాసు లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించగా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఏడాది పాటు ఉండే ఈ మండల శాఖ కార్యవర్గంగా గౌరవాధ్యక్షులు వి.శివరాంనాయుడు, అధ్యక్షులు మువ్వల రమేష్, సహాధ్యక్షులు పి.బాలకృష్ణ, ఎస్.భ్రమరాంబ, ప్రధాన కార్యదర్శి బలివాడ నాగేశ్వరరావు, కోశాధికారి ఆర్.దాలినాయుడు, కార్యదర్శులు టీ.ఎల్.ప్రసాద్, డి.భాస్కరరావు, బి.మహేశ్వరరావు, ఎం.శివున్నాయుడు, బి.జగదీశ్వరరావు, సి.హెచ్.కృష్ణప్రసాద్, ఎం.శ్రీరాములు, కె.సూర్యనారాయణ, వి.వెంకటరమణ, సి.హెచ్.సోమశేఖర్, జిల్లా కౌన్సిలర్లు కురిటి బాలమురళీకృష్ణ, జి.రమేష్, డి.వెంకటరావు, కొన్న తిరుపతిరావు, బి .రామకృష్ణ,  వడ్డి ఉషారాణి, సిపిఎస్ కన్వీనర్  వై.భాస్కరరావు, మహిళా కమిటీ సభ్యులు ఆర్.గీత, వై.భవాని, ఎం.పార్వతమ్మ, ఎం.శోభారాణి, ఆడిట్ కన్వీనర్ పి.రాజబాబులు ఎంపికైనారు. వీరిచే జిల్లా బాధ్యులు ప్రమాణస్వీకారం గావించారు
కామెంట్‌లు