రామాపురం అనే గ్రామంలో లక్ష్మి, రామయ్య ఒక పేద కుటుంబం నివసించేది. వారికి ఇద్దరు పిల్లలు రవి, అలేఖ్య వాళ్లకు చదువు అంటే ఎంతో ఇష్టం కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులలో చదువుకోలేకపోయారు. పిల్లల ఆసక్తిని గమనించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. మన పిల్లలను కూడా చదివిద్దాం. వాళ్లకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా కష్టంచేసి మన పిల్లలను చదివిద్దామని అనుకున్నారు.
లక్ష్మి, రామయ్యలు అప్పటినుండి వాళ్ళు చేసిన పనికన్నా ఎక్కువ సమయం పని చేస్తూ, వాళ్ళ సంపాదనలో సగభాగం పిల్లల చదువు కోసం కూడబెట్టసాగారు.
బిడ్డలను పాఠశాలలో చేర్పించారు. తల్లిదండ్రుల కష్టం చూసి రవి, అలేఖ్య లు అమ్మ మీరు ఇంతగా ఎందుకు కష్టపడుతున్నారు? మీ ఆరోగ్యం చూసుకోండి. మీరు కూడా నాయనమ్మలాగా అనారోగ్యం పాలయితే మేము ఏం కావాలి చెప్పమ్మా అని అడిగారు. వారి మాటలు విన్న లక్ష్మి మీరు కూడా మా మాదిరిగా కష్టపడకూడదు. మిమ్మల్ని బాగా చదివించాలనుకున్నాం అని అన్నది. సరే ఇద్దరం కలిసి మంచిగా చదువుకుంటాం కానీ సెలవు రోజుల్లో మీతో పాటు మేము కూడా పనికి వస్తాం. తర్వాత రోజు మీకు మాకు కావాల్సిన వస్తువులు తీసుకుని బడికి వెళ్తాం అని రవి, అలేఖ్య లు అన్నారు. ఎంత కష్టమైన మేము కష్టపడుతాం మీరు పనికి వద్దు. మీరు బాగా చదువుకోవాలి. మేము ఎలాగైనా చేసి మిమ్మల్ని చదివిస్తామంటూ లక్ష్మి బిడడల తల నిమిరింది.
తల్లి లక్ష్మి చెప్పిన మాటల వలే రవి, అలేఖ్య లు ప్రతి రోజు పాఠశాలకు వెళ్తున్నారు. అక్కడ తోటి పిల్లలతో ఎంతో మంచిగా ఉంటూ, చదువులో ప్రథమంగా రావడం చూసిన టీచర్లు అందరూ వాళ్ళని మెచ్చుకునేవారు. వారికి ఎన్నో బహుమతులు వచ్చేవి. బహుమతులను చూసిన వాళ్ళ తల్లిదండ్రులు గర్వపడేవారు.
అలేఖ్య, రవిలకు పదవ తరగతి పూర్తయిపోవడంతో వాళ్లకి ఇంకా చదవాలని కోరిక ఉన్నప్పటికీ వాళ్ళను తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేకపోవడంతో పనికి తీసుకెళ్లారు. వాళ్ళు తల్లిదండ్రులతో పని ప్రదేశంలో చూసిన వాళ్ల రమణయ్య మాస్టర్ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీరు చదువుకోవడం లేదా !అని ప్రశ్నించాడు. అలేఖ్య, రవిలు మాస్టర్ మాకు చదువుకోవాలని ఉంది కానీ మా కుటుంబ పరిస్థితి అందుకు సహకరించడం లేదు అని బాధపడుతూ చెప్పారు. వారి మాటలు విన్న రమణయ్య మాస్టర్ వారికి కావాల్సిన సౌకర్యాలను నేను చాలా సమకూరుస్తానని కష్టపడి చదవమని, దాతల సహకారంతో వసతులు సమకూర్చాడు. మాస్టర్ ప్రోత్సాహంతో అలేఖ్య, రవిలు బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. అనుకోకుండా ఒక రోజు వాళ్ళకి రమణయ్య మాస్టర్ కనబడ్డాడు. మాస్టర్ ను చూసిన సంతోషంతో అలేఖ్య, రవిలు ఆనందంతో కన్నీరు కార్చారు. మాస్టర్ ఇద్దరిని ఎంతగానో మెచ్చుకున్నాడు. రవి, అలేఖ్య లు కూడా రమణయ్య మాస్టర్ ద్వారా పేద విద్యార్థులకు వసతులు సమకూర్చుతూ సాయపడసాగారు.
"నీతి చిన్నప్పుడు కష్టపడితే పెద్దయిన తర్వాత ఫలితం దొరుకుతుంది"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి