నాగాపురం అనే గ్రామంలో సుజాత,రాణి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.రాణి ఆటపాటల్లో ఇంకా చదువులో కూడా ముందుండేది.సుజాత మాత్రం చదువుపట్ల ఆసక్తి లేకుండా, ఎప్పుడూ ఆటల్లోనే మునిగిపోయేది.రాణి ఇంకా మిగిలిన స్నేహితులు ఎంత చెప్పినా చదువు పట్ల శ్రద్ధ పెట్టేది కాదు.కొన్నిరోజుల తర్వాత మాపాఠశాలకు ఒక ఉపాధ్యాయురాలు వచ్చింది.ఆమే మాధురి టీచర్.మాకు రోజు పాఠాలతో పాటు మంచిమాటలు చెప్పేది,మంచి కథలు చెప్పేది అలాగే మాకు ఇష్టమైన ఆటలు ఆడించేది.టీచర్ అన్నీ నేర్పించటం సుజాతకు ఎందుకో బాగా నచ్చింది.టీచర్ పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగింది.అప్పటి నుండి టీచర్ ఏది చెప్పినా శ్రద్ధ గా వినేది.బాగా చదివేది.ఇట్లా కొన్ని రోజుల్లోనే సుజాతలో వచ్చిన మార్పుకు మేమంతా సంతోషించాము.
మార్పు:- జి.భార్గవి-ఐదవతరగతి-MPUPS నాగిరెడ్డి పేట్ ,-జిల్లా :కామారెడ్డి .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి