గీతా గ్రంధ0 మహత్తరం- వందే కృష్ణం జగద్గురుం : .. కోరాడ నరసింహా రావు!
సాక్షాత్ శ్రీ మహా విష్ణువే.... 
 కృష్ణునిగా అవతరించి... 
  బోధించిన జీవన రీతులే... 
  గీత లోని రాతలు...! 

నరునికి నారాయణు డుపదే సించిన జ్ఞానామృతమే గీతా సారము...! 

గీతను మించిన జ్ఞానగ్రంధము
 కృష్ణునికన్న మిన్నయైన ఆచా ర్యుడు నభూతో , న భవిష్యతీ

గీత సమగ్ర విజ్ఞానసర్వస్వము
 సమస్య యేదైనా, సమాధానము చూపి,పరిష్క రించగలిగేది* గీత *మాత్ర మే

భక్తి , జ్ఞాన , కర్మ, ఆత్మ సంయ మనాది పదునెనిమిది అధ్యా యములలో ...అష్ఠాదశ యోగ ములతో నిక్షిప్తమై యున్నది ఈ గీతామకరందము... ! 

ఇది కుల, మతముల కతీత మైన మహోత్కృష్ట మానవ జీవన పాఠ్య గ్రంధము...! 

ఈ గ్రంధ రాజము గ్రహించ గలిగిన వారికి , గ్రహించ గలిగినంత అందించు చునే యున్నది...! 

రండు దుఃఖ భూయిష్టముగ మారిపోవు తున్న మన జీవితములను ఈ గీతాజ్ఞా
నా0బుధిలో మునకలు వేయించి... ఆ యానందార్ణవ మున ఓలలాడుదము ... 
 మన జీవితములను తరింప జేసి కొందము రండు... రండు!! 
    ********
...

కామెంట్‌లు