అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు ఏకపురం, ఆ ఊరిలో కాకులు ఎక్కువగా ఉండేవి అవి ప్రజలను ఇబ్బంది పెట్టేవి. ఇబ్బంది పడిన ప్రజలు ఊరి పెద్దలు దగ్గరికి వెళ్లి ఆ ఇబ్బంది గురించి చర్చించారు. ప్రజలందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చారు అదేమిటంటే కాకులు తినే ఆహారంలో మందులు పెట్టారు. మందు పెట్టిన హారాన్ని తిని అన్ని కాకులు మరణించాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏకాపురంలోజనంకు రోగాలు మొదలయ్యాయి కారణమైందని ఆ ఊరి ప్రజలు ఆలోచిస్తే ఇంతకుముందు జంతువులు చనిపోతే వాటిని కాకులు తినేవి ఊరు శుభ్రంగా ఉండేది
ఇప్పుడు కాకులు లేవు కాబట్టి చనిపోయిన జంతువుల యొక్క శరీరా లు కుళ్ళిపోయి పురుగులు పడి జనానికి రోగాలు వస్తున్నాయి
అప్పటినుంచి ఒక ఆలోచన వచ్చారు చంపేశాను ఏ జీవి తక్కువది కాదు నేను చెవి ఎక్కువ కాదు అన్ని జీవులు గొప్పవే అందుకే ఏ జీవిని తక్కువ అంచనా వేయకూడదు ఏ జీవి పని ఆ జీవి చేస్తుంది. ఇప్పటి నుండి మనం అనవసరం గా ఏ జీవిని కూడా మన కు ఆపద కలిగిస్తేనే చంపాలి అని అనుకొని ఒప్పందం చేసుకొన్నారు. అప్పటినుండి ఆ ఊరు ప్రజలు జీవిని అనవసరంగా చంపడం లేదు.
నీతి :- అనవసరంగా ఏ జీవిని చంపకూడదు, దేని గొప్పదనం దానిదే.
కాకులు పారిశుద్ధ్య కార్మికులు:- దిలీప్ కుమార్, -10వ తరగతి,-జి. ప. ఉ. పాఠశాల అయిటిపాముల, -నల్లగొండ, తెలంగాణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి