(1)"నాకూ మా ఆవిడకు గొడవ జరిగినప్పుడల్లా నేను కిరసనాయలు డబ్బా దాచేస్తాను" అన్నాడు మనోహర్.
" ఆహా ! ఎంత ముందు చూపురా నీది. ఆవేశం లో మీద కిరసనాయలు పోసుకొని ఎక్కడ అంటించేసుకుంటుందేమోనన్న భయం కదూ నీకు ?" అడిగాడు విక్రం.
"చ చ అదేం కాదు. గొడవ మొదలయ్యాక కోపం తో ఎక్కడ నా మీద పోసి అంటిస్తుందేమోనన్న భయం నాకు" చల్లగా అసలు సంగతి చెప్పాడు మనోహర్.
(2). "ఏమండీ, మీ నాన్నగారికి శ్వాస బాగా ఆడడం లేదు,పరిస్థితి బాగా సీరియస్ గా వుంది,వెంటనే డాక్టర్ ను తీసుకు రండి" ఆందోళనగా చెప్పింది రమ్య.
"ఒహో అలాగా ! అయితే ఇప్పుడు నేను వెళ్ళవల్సింది డాక్టర్ దగ్గరకు కాదు, లాయర్ దగ్గరకు, వీలునామా వెంటనే రాయించి తీసుకువస్తాను" అంటూ ఆదరాబాదరగా పరిగెత్తాడు శేఖర్.
(3) " "ఏమండీ, వంటింట్లో దొంగ దూరినట్లున్నాడు, పెద్ద పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. తొందరగా లేచి వెళ్ళి పట్టుకోండి" గాభరాగా భర్తను నిద్ర లేపింది అనసూయ.
" ఏం పర్లేదు లేవే ! నువ్వు చేసిన వంట తిని వాడు వెంటనే కళ్ళు తిరిగి మూర్చ పోవడం ఖాయం.బహుశా మొదటి సారి తినడం వలన కోమా లోని కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు తీరికగా పోలీసులను పిలుచుకు రావచ్చులే !అంతదాకా హాయిగా ముసుగు తన్ని పడుకో " ఆవులిస్తూ దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు రత్నాకర్.
(4) ఆ ప్రొఫెసర్ గారు గత మూడు గంటల నుండి గుక్క తిప్పుకోకుండా అనర్గళం గా ఉపన్యాసం ఇచ్చారు కదా! ఈ ఒక్క మాట కూడా అర్ధం అయి చావలేదు.ఇంతకూ ఏ టాపిక్ మీద మాట్లాడి వుంటారంటావు ? “అడిగాడు విశ్వం.
“కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరచుకోవడం ఎలా ?” అనే సబ్జెక్ట్ పై ఆయన మాట్లాడారు." ఆసలు సంగతి చెప్పాడు గోపి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి