(1) టిఫిన్ చేసాక జేబులు తడుముకొని హడావిడిగా కౌంటర్ దగ్గరకు పరిగెత్తాడు సుబ్బారావు. “సార్, నా పర్సు ఇంట్లో మరిచిపోయాను.”
“ఏం పర్లేదు. ఏమైనా విలువైన వస్తువులుంటే ఇక్కడ వుంచి వెళ్ళండి. తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకువెళ్దురు గాని!” చెప్పాడు కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి.
“ నా దగ్గర విలువైనవి ఏమీ లేవే, ఎలా ?” సందేహం వ్యక్తం చేసాడు సుబ్బారావు.
“మరేం భయపడకండి, ఆ ఫాంటు, షర్టు గోడకు తగిలించి హాయిగా వెళ్ళండి” తాపీగా చెప్పాడు కౌంటర్ దగ్గర వ్యక్తి.
(2)“ఈ రోజు స్కూలుకు రావడం అంత లేటయ్యిందేం ?” రామూని అడిగింది టిచర్.
“ ఈ వీధిలో కొత్తగా పెట్టిన బోర్డు వలన లేటయ్యింది టిచర్”
“ఆ బోర్డులో ఏం రాసుంది? “ అడిగింది టిచర్.
“స్కూలు ప్రాంతం ,నెమ్మదిగా వెళ్ళండి అని రాసుంది టిచర్” అసలు సంగతి చెప్పాడు రాము.
(3)“ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఎంత తప్పో ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది”
“ఏమయ్యింది ?”
‘ప్రేమించుకొనే రోజుల్లో నీ కోసం నరకానికైనా వెళ్ళడానికి సిద్ధంగా వున్నానని అనేవాడిని. పెళ్ళయ్యాక నిజంగానే నరకం లో వున్న ఫీలింగ్ కలుగుతోంది.”
(4)"డాక్టర్ గారూ, నా ఎడమ కాలు లో నొప్పి ఎక్కువగా వుంది.
"అది వయసు మీరడం వలన వచ్చిన నొప్పి లెండి.
" కానీ డాక్టర్ గారూ, నా రెండు కాళ్ళ వయసూ ఒకటే కదా ? మరి కుడి కాలికి కూడా నొప్పి ఎందుకు రాలేదు ?"
నవ్వుతూ బ్రతకాలిరా -- 15 : -సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి