ఊరుగాలి ఈల 18:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
పండుగల ఆనందాలు పురివిప్పిన రెక్కల
సంక్రాంతి చలిమంటల భోగి  బొడబొడాల పిల్లలు
ముగ్గులు సకినాలు బంధు జన విందులు

మామిడి చింత బెల్లంవేప ఉప్పు కారాల 
కొత్త సంవత్సరాది ఉగాది పచ్చడి ఆరు రుచులు 
వెలిగించు బతుకున కొత్త ఆశల రోజు

రంగుల పండుగ హోళి బతుకు రంగేళి 
ఆడేటి నాట్యాలు మిత్రుల ఆలింగనాలు
ఎవరు నేర్పిరొగాని సంగమమే ఆనంద డోల

చవితి బొడ్డెమ్మ బతుకమ్మ దసరా పర్వఎదల    
శ్రీ రామనవమి రంజాన్ క్రిస్టమస్ ఎల్లెడల ఊరు
అన్నదమ్ముల బతుకు దీప్తి అస్తిత్వ తెలంగాణ 

శివరాత్రి పూనకాలు ఉపవాస దీక్ష   ఆరోగ్యసూచి
పగలు రాత్రి శ్రమచేయ మెలకువ నిద్ర కువకువలు
కడుపునిండా తిండి కనుల నిద్ర స్వాస్త్య ముద్ర

పండుగల సంతసి పనుల తపస్వి మనిషి
చెంగున గంతేసే హలాలన్నీ పొలాల దున్న
చీకటి తెంచే వేకువ,వెలుగునే మింగే రాత్రి పోటీ

తెగని రెక్కల పరుగు అలలే పల్లె కలలు కాంతి 
మనసున మమతలు చేయు బాధల దూరం
ఉత్సవాల మనిషి హిమజ్వాల  మహిమ ఊరు

===========================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు