మనిషి పాటకు చెవులూ కనులె ఊరి ఊపిరి
నాట్యమాడే ఆటల పైట అందాలన్నీ మెరిసేఊరు
ఎరుగని అలసట సేదదీరే బాటసారి డొంక ఇది
శబ్దనిశ్శబ్దాల జీవ క్రియ మాటల ఊరూ నాదే
నడిచిన మట్టితొవ్వ సరిగమల శంఖ ధ్వని ఎద
సొపతుల కొట్లాటల ప్రేమలు నాటిన పైరు ఊరు
రెప్పలు తెరిచీ మూసినవీ లోపలి కన్నుల కథ
కావ్యసిరుల కొత్త భావాలన్నీ ఊరు మోగే సితారా
పద లయల నాట్యాలు జఘనాల గగనాలు ఆడే
ఎడ్ల బండిలో పరుగు తెలవారు కాంతి ఊరు
శుకపికముల స్వనమే కిలకిల నవ్వే విరులు
ఆశల వాహిని ఊగే పాటల పల్లకిలో ఊరు
మత్తెక్కించని మధువొలికే కంటి ఇంపు
సంజ కెంజాయ రమణీయమే పల్లె రమణి
అవునన్న కాదన్న నా ఉనికి ఊరు హృదయం
తనివి తీరదు ఎంత చెప్పినా శిలాశిల్ప మువ్వ
అమ్మలోని ప్రాణం అనురాగ సేతువు ఊరు
గవ్వల గువ్వలు గడప వాకిలి సడి కంజీర
కరకట్ట కట్టడి తడిసే తడి చెరువు వెలికట్ట
మనసు మీటిన రాగమాల హేల రాగ జోల
పారాడి కెవ్వని ఆటలాడిన కొమ్మల ఊరు
==========================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి