ఊరుగాలి ఈల 20:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఈలలు వేసిన ఎదపొరల పైరు అద్దాల పేరు 
మనిషిని చెక్కిన అద్భుత ఉలి కలల పల్లె
తేనెటీగల సీతాకోకచిలుక తీపిరంగుల పోత సేత

విశ్వ కవితనే ఎద వాకిట పేర్చిన ముగ్గు 
తాళపత్రాల దూప దీర్చిన కలాల యజ్ఞం
గాయాలను మాన్పే లేపనం జీవించే నది

ఎవరికి చేదు ఊరువాడల బువ్వ జిహ్వ 
బతుకంత నీలో కదిలిన కడలి సడి ఊరు
నేటి వత్తిడి గెలిచిన ప్రశాంత గాలి ఊదేచెట్టు

ఒక కలల కథ కమ్మని రాగాల చల్లని ఊరు
కల్పనకే దొరుకని అపురూప కావ్యాల తేరు
గుడిసె గుండెల మూపు గడ్డిమోపు నీడ పల్లె 

మర్రి ఊడలు దిగిన నేల మట్టి  పట్టే నగరబాట 
గాలి నీరు వాకిలి పెరడు చెరువు  లేని సంత 
రంగుల లోకాన పొంగు మత్తు అరువు నగల సిరి

కోతి కొమ్మచ్చి మనిషి గిరుక బావి పల్లె వీర!
కడవెత్తిన నీరు బువ్వకుండ మెతుకు సాకీ
పాట పల్లవి పాడె ఆకు తంబూర తీగ రాగమై

మనసు మనసున మీటు మనిషి గంధం
మనిషి మనిషి సంయోగ జీవక్రియ  ఊరు
కావలించే ఎదమాటు సిగ్గు మొగ్గలేసే బుగ్గ

=======================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు