రండి మిత్రులారా రండి
పుస్తకోత్సవానికి
జ్ఞానమస్తకోత్సవానికి
పరుగుపరుగునా పోదాం రండి
బుక్స్ కల్చర్ పెంపొందించేందుకు
లుక్స్ కల్చర్ దశలవారీగా
కొంతైనా దూరం చేసుకోవడానికి
బ్లూ స్క్రీన్ కు అలవాటు పడ్డమన కళ్ళ మసకలు
దూరం కావడానికి
కంటికి వ్యాయామం చేకూర్చడానికి
పుస్తకాన్ని మించిన ఉపకరణం మరొకటి లేదని ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటుదాం రండి
రండి మిత్రులారా రండి
ఆలసించిన ఆశాభంగం
మంచితరుణమిది
మించిన దొరకదు
బాలసాహిత్యం
ఫ్రౌఢసాహిత్యం
పద్య ,వచన, గేయ కవులతో పాటు
విజ్ఞాన శాస్త్రాలు చరిత్ర గ్రంథాలతో
అలరారే
సాహితీ భాండాగారమిది
రండి మిత్రులారా రండి
పుస్తకం హస్తభూషణమేకాదు
పుస్తకం మస్తకభూషణంకూడా
ఉద్యోగార్థుల అధ్యయనాలు
నవలలు కథాగ్రంథాలు గల్పికలు
ఎన్నెన్నో గ్రంథాలున్న అంగళ్ళు
పుస్తక ప్రియులకు జ్ఞానామృతనిధి
రండి మిత్రులారా రండి
మన అజ్ఞానాంధకారాన్ని దూరం చేసుకుందాం
జ్ఞానాంజనను దిద్దుకుందాం
(ఈ నెల 19 నుండి29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహణ సందర్భంగా వ్రాయబడిన కవిత )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి