చెంగుచెంగున ఎగిరే లేగల మెడ గంటలు
రంకెలేసే వృషభ కొమ్ముల జాడల ఊరు
మనిషిని చుట్టిన ప్రకృతిలో కేంద్రం సంఘజీవి
మనిషి మనిషిని అల్లుకొన్న స్వరచాలన సవ్వడి
మనసు మనసున ఊరేగే కళల చెట్టు ఊరు
చెడుగుడు ఆటల లయలో మట్టి పచ్చరక్తం గుండె
జోరు వాన అందాలు గాలిఅలల ఇంద్ర ధనుస్సు
గాయపడని దేహాల రక్తమోడని ఆకుల ఊరు
పల్లెసిరుల సుఖదుఃఖాలు వల్లెవేసే పాఠాలు
ఇసుక గూళ్ళ గొంతు తడితడి స్వేద మడి వొడి
వరి కంకులూగే కొండ కొమ్ముల గాలి గంధం
నగరజీవి ఆశ దీర్చు పల్లె ప్రశాంత పర్ణశాల
ఆపద సంపదల చిరకాల కలిమి ఊరు బాట
కొత్తవారు పిలువని అతిథి గూడు మనసు నీడ
బువ్వకూరల రుచి ఆరోగ్యం అమలిన శుచిగీతం
రమణీయ రంగుల పొంగు తాకిన నింగి సింగిడి
కనువిందు చేసే అందాల మట్టివాసనల జీవగర్ర
స్నేహ మెట్లెక్కిదిగిన వెదురు గుండెల సోపతి
మది మోగే వీణల తీగలు యాది పాటలు
ఊరు ఈలలు చిందేసే పిలుపు ఎగిసే జలపాతం
మంచునిప్పు వేడిచలువల గూటి చలన జీవం
============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి